Devara: దేవర కలెక్షన్స్ ఫేకా..? రూ. 500 కోట్లతో రికార్డు బ్రేక్..
ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర పార్ట్ -1’. మిక్స్ డ్ టాక్ తో విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తో రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
అంతేకాదు ‘దేవర’ మూవీ తెలంగాణ (నైజాం)లో రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అక్కడ ఈ సినిమా రూ. 60 కోట్ల షేర్ (రూ. 111 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా ఈ సినిమా రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు అఫీషియల్ గా ఓ పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్ని ఫేక్ కలెక్షన్స్ అని చెబుతున్నారు.
కానీ జీఎస్జీ ఇతర టాక్సులను లెక్కలేస్తే .. ‘దేవర’ సినిమా రూ. 480 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఓ రూ. 20 కోట్ల గ్రాస్ అదనంగా యాడ్ చేసినట్టు తెలుస్తోంది.
దసరాకు వచ్చిన సినిమాలేవి కూడా ‘దేవర’కు పోటీ ఇచ్చేవిగా లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చాయి. మొత్తంగా ఈ సినిమా చేసిన బిజినెస్ పై దాదాపు రూ. 60 కోట్ల షేర్ రాబట్టింది.
ఎన్టీఆర్ విషయానికొస్తే.. దేవర తర్వాత దేవర పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నారు. మరోవైపు ‘వార్ 2’ మూవీతో ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీలు లైన్ లో ఉన్నాయి.