Jr NTR: భార్యతో ఎన్టీఆర్ గొడవ.. నో కాంప్రమైజ్ అంటున్న ఎన్టీఆర్..!
ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేసి భారీ విజయం అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.. ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా సినిమా జీవితానికే కాదు వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు ఎన్టీఆర్. అందుకే కాస్త సినిమా షూటింగ్లకు బ్రేక్ దొరికితే చాలు భార్య, పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు.
ముఖ్యంగా తన భార్య ప్రణతి , అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన తల్లి షాలిని, భార్య పిల్లలతో కలిసి తన తల్లి సొంత ఊరు కుందాపూర్ లోని దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తన భార్యతో గొడవపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒకానొక సందర్భంలో వెల్లడించడం గమనార్హం. తాము కూడా అందరి భార్యాభర్తల్లాగే గొడవ పడతామని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా ఏసీ విషయంలో మాటల యుద్ధం జరుగుతుందని కూడా ఎన్టీఆర్ తెలిపారు. అయితే తన భార్య ప్రణతి ఏసీ విషయంలో తన కోసం కాంప్రమైజ్ అవుతుందని, అయితే తాను మాత్రం ప్రణతి కోసం ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మొత్తానికైతే తన భార్య ప్రణతి మంచి మనసును మరొకసారి గుర్తు చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు ఎన్టీఆర్. ఇకపోతే ప్రతి ఆదివారం ఆయనే స్వయంగా వంట వండి కుటుంబ సభ్యులకు వడ్డిస్తారు అని కళ్యాణ్ రామ్ ఒకానొక సందర్భంలో తెలిపిన విషయం తెలిసిందే.