Lamborghini Urus car: రూ. 5 కోట్లతో ఎవ్వరికీ లేని Luxury car book చేసిన Jr Ntr !
Jr Ntr booking Lamborghini Urus car: సినిమా హీరో, హీరోయిన్స్‌కి Luxury cars కొనడం అంటే ఎంతో క్రేజో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఖరీదైన కార్లు మెయింటెన్ చేసే వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.
లగ్జరీ ఫీచర్స్‌తో పాటు సేఫ్టీకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఎన్టీఆర్.. అలాంటి కార్లు ఎక్కడున్నా, ఎంత ఖర్చయినా వాటిని ఇష్టంగా తెప్పించుకుంటారనే పేరుంది. అందులో భాగంగానే Jr Ntr తాజాగా ఇటాలియన్ లగ్జరీ కారు Lamborghini Urus ని హైదరాబాద్‌కి ఇంపోర్ట్ చేయిస్తున్నాడట.
హైదరాబాద్‌కి చెందిన ఓ Imported cars dealer ద్వారా సుమారు ఐదు కోట్లు వెచ్చించి మరీ Lamborghini Urus car ని బుక్ చేయించినట్లు టాక్. ఇలాంటి కారు హైదరాబాద్‌లో ఎవరికీ లేదట. అందుకే యంగ్ టైగర్ ఈ కారుపై కన్నేసినట్టు ఫిలింనగర్ టాక్.
ప్రస్తుతం తారక్ RRR movie చేస్తుండగా.. ఇది పూర్తి కాగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస రావు దర్శకత్వంలో కొత్త సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఓవైపు RRR movie shooting లో పాల్గొంటూనే మరోవైపు Meelo Evaru Koteeshwarudu show ను హోస్ట్ చేసేందుకు సైన్ చేశాడు.
మూడు నెలల పాటు కొనసాగనున్న ఈ టీవీ షో కోసం Jr Ntr remuneration బాగానే చార్జ్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.
అన్నట్టు ఎన్టీఆర్ Luxury cars మెయింటెన్ చేయడంలోనే కాదు... వాటికి Fancy numbers booking చేసుకోవడంలోనూ తారక్ ముందే ఉంటాడనే సంగతి తెలిసిందే.