Jr NTR: బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ ని కలపడానికి రంగంలోకి దిగిన నిర్మాత..!

Tue, 24 Dec 2024-1:08 pm,

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయనే విధంగా ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అంతేకాకుండా గతంలో అటు చంద్రబాబు పైన జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఎన్టీఆర్ స్పందించకపోవడంతో నందమూరి కుటుంబానికి , ఎన్టీఆర్ కి మరింత దూరం పెరిగిందని అభిమానులు కూడా భావించారు.   

అయితే ఈ గ్యాప్ ని కొంతమంది రాజకీయ నాయకులు వాడుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.  ఇలాంటి సమయంలోనే బాలయ్య అబ్బాయికి దగ్గర అవుతున్నాడనే వార్త తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అది కూడా బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకువచ్చేలా ప్రముఖ నిర్మాత నాగవంశీ  ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

గతంలో కూడా నాగవంశీ ఎంతోమంది సెలబ్రిటీలను ఇలా తాను నిర్మించే సినిమాలకు గెస్టులుగా కూడా తీసుకు వచ్చారు. మరి ఇప్పుడు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. గతంలో కూడా బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి అటు కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్లుగా రావడం జరిగింది. ఇక తర్వాత మళ్లీ మీరందరూ కూడా ఎక్కడ కలిసి కనిపించడం లేదు. 

మరి ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి విభేదాలకు చెక్ పెడతారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది.. జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అయ్యారు.

ప్రస్తుతం వార్ 2 సినిమాలో బాలీవుడ్ లో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి చేసుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నారు.. ఇక బాలయ్య కూడా అఖండ 2 చిత్రంలో బిజీ కాబోతున్నారట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link