Jupiter Retrograde: శుక్రరాశిలోకి గురు సంచారం.. ఈ రాశికి అంతులేని ధన సంపద, భోగభాగ్యాలు..!
మేష రాశి.. మేషరాశివారికి ఈ గురు రాశి మార్పు బాగా కలిసి వచ్చే అంశం. గురు అనుగ్రహంతో జీవితంలో అన్ని కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబంలో సఖ్యత కూడా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. అప్పుల బాధలు త్వరగా తొలగిపోతాయి. ఈ సమయం ఈ రాశివారికి శుభయోగాలు కలిగే సమయం
వృషభ రాశి.. ఈ రాశివారికి కూడా గురు గ్రహ మార్పు వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. వీరికి ఆర్థికంగా కూడా బాగా కలిసే వచ్చే సమయం. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. ఈ సమయంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి.
కర్కాటక రాశి.. కర్కాటక రాశివారికి గురు వక్ర గ్రహ సంచారం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఈ గ్రహ మార్పుల వల్ల అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కర్కాటక రాశివారికి అనుకున్న జాబ్ కూడా పొందుతారు.
సింహ రాశి.. సింహ రాశివారికి ఈ సమయం శుభప్రదం ముఖ్యంగా వీరు అనుకున్న ఉద్యోగం, ప్రమోషన్ పొందుతారు. ఈ సమయంలో ఏ ప్రయత్నాలు చేసినా సఫలమవుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం. సింహ రాశివారికి గురు సంచారం అన్ని శుభాలను అందిస్తుంది.
కన్య.. కన్య రాశివారికి కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో వ్యాపారాల్లో బాగా లాభాలను ఆర్జిస్తారు. ముఖ్యంగా కన్య రాశివారికి గురు గ్రహ మార్పులు వల్ల అనుకున్నది సాధిస్తారు. ప్రమోషన్ కూడా పొందుతారు.
వృశ్చిక రాశి.. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. ఏ రోగాలు దరిచేరవు ముఖ్యంగా ఈ సమయంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో కూడా బాగా లాభాలను కూడా ఆర్జిస్తారు. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది.
మకర రాశి.. మకర రాశివారికి ఆనందం, శుభాలు కలుగుతాయి. గురు గ్రహ సంచారం వల్ల అపారమైన ధనసంపద కలుగుతుంది. వ్యాపారాల్లో కూడా బాగా లాభాలను పొందుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)