Jupiter Transit: గురుగ్రహం స్థానమార్పు.. ఈ రాశులకు గోల్డెన్‌ టైం షురూ.. మహర్జాతకం పట్టబోతుంది..

Sun, 28 Jul 2024-7:34 pm,

మేషరాశి.. మేషరాశివారు కాస్త ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం. ముఖ్యంగా ఈ సమయంలో ఏ వ్యాపారం ప్రారంభించిన కలిసి రాదు. అంతేకాదు వీరు ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, మేషరాశి వారు ఏదైనా విహారయాత్రలకు వెళ్తారు.

వృషభం.. వృషభ రాశివారికి ఈ సమయం ఎంతో శుభం అంతేకాదు పనుల్లో విజయం సాధిస్తారు. వీరు కోరుకున్న కోరికలు తీరతాయి. విద్యార్థులకు కూడా ఇది ఎంతో మంచి కాలం. 

మిథున రాశి.. గురు గ్రహం మిథున రాశిపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ పెద్దల సహకారం ఉంటుంది. అంతేకాదు ఈ రాశివారు ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన సమయం.

కర్కాటక రాశి.. ఈ సమయంలో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అయితే, కర్కాటక రాశివారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అయితే, వృత్తి పరంగా కూడా కాస్త మార్పులు అయ్యే అవకాశం ఉంది.

సింహం.. గురుగ్రహం మృగశిర నక్షత్రంలోకి మారుతున్న తరుణంలో ఉద్యోగం మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారికి ఈ సమయంలో ఖర్చులు పెరుగుతాయి. వీళ్లు కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం.

కన్య.. కన్య రాశివారికి ఇది కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం. ముఖ్యంగా వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడతాయి. భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అయితే, కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది.

తులరాశి.. తులరాశి వారికి వ్యాపారంలో ఆర్థిక లాభాలు బాగుంటాయి. అయితే, ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు వెనుకా ముందు ఆలోచించాలి. ఓపిక ఎంతో ముఖ్యం

వృశ్చిక రాశి.. ఈ రాశివారు పనుల్లో విజయం పొందుతారు. ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు కూడా ఈ సమయంలో ఎంతో ఓపికగా ఉండాలి.   

ధనస్సు.. గురు గ్రహం అనుగ్రహ వల్ల ఈ రాశికి ఆర్థిక అభివృద్ది కలుగుతుంది. వృత్తివ్యాపారాల్లో బాగా రానిస్తారు. ధనస్సు రాశివారికి కుటుంబ సహకారం కూడా లభిస్తుంది.

మకర రాశి.. ఈ సమయంలో మకర రాశి వారు కూడా ప్రయాణాలు చేయవచ్చు. మకరరాశివారికి కూడా ఓర్పు ఎంతో అవసరం. మీరు ఏ పనులు చేసినా లాభం పొందుతారు.

కుంభ రాశి.. గురు అనుగ్రహం వల్ల కుంభ రాశివారికి కూడా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం బాగా పుంజుకుంటుంది. సహనం ఎంతో అవసరం.

మీన రాశి.. మీన రాశివారికి కూడా ఈ సమయం అదృష్ట కాలం. మీన రాశివారి అనుగ్రహంతో ప్రయాణాలు చేస్తారు. ఇవి లాభిస్తాయి. అయితే, భాగస్వామితో ఏవైనా విభేదాలు ఉంటే తొలగిపోతాయి. వృత్తివ్యాపారాల్లో కూడా బాగా కలిసి వచ్చే కాలం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link