Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ హాట్ గ్లామర్ ట్రీట్.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన ఎక్కడా తగ్గడం లేదుగా..
కాజల్ అగర్వాల్.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 17 యేళ్లు అవుతోన్న ఇప్పటికీ అదే అంద చందాలతో ఆడియన్స్ ను అలరిస్తోంది. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు మూవీస్ కు దూరంగా ఉన్న .. కాజల్.. రీసెంట్ గా తను టైటిల్ రూల్ పోషించిన ‘సత్యభామ’ మూవీతో ఆడియన్స్ ను పలకరించింది.
ఎన్నో ఆశలు పెట్టకున్న సత్యభామ సినిమా కాజల్ అగర్వాల్ కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ సినిమాకు సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.
మ్యారేజ్ తర్వాత హీరోయిన్స్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే. కానీ కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రమే పెళ్లైన ఇప్పటికీ చిత్రాలతో బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తోంది.
ప్రస్తుతం కాజల్ చేతిలో ‘ఉమ’, ఇండియన్ 3 సినిమాలతో పాటు ‘కన్నప్ప’ సినిమాలున్నాయి. కన్నప్పలో ఈమె ప్రభాస్ కు జోడిగా నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.
కాజల్ అగర్వాల్ లాస్ట్ ఇయర్ ‘భగవంత్ కేసరి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాలకృష్ణ ఖాతాలోకి వెళ్లింది.
కాజల్ అగర్వాల్.. తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్ గా వెనుదిరిగి చూసుకోలేదు.