Kajal Aggarwal: పెళ్లైన గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గని కాజల్ అగర్వాల్..
కాజల్ అగర్వాల్.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 17 యేళ్లు అవుతోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు మూవీస్ కు దూరంగా ఉన్న .. కాజల్.. రీసెంట్ గా ‘సత్యభామ’ మూవీతో ఆడియన్స్ ను పలకరించింది.
ఎన్నో ఆశలు పెట్టకున్న సత్యభామ సినిమా కాజల్ అగర్వాల్ కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ సినిమాకు సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.
మ్యారేజ్ తర్వాత హీరోయిన్స్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే. కానీ కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రమే పెళ్లైన ఇప్పటికీ చిత్రాలతో బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తోంది.
ప్రస్తుతం కాజల్ చేతిలో ‘ఉమ’, ఇండియన్ 3 సినిమాలతో పాటు ‘కన్నప్ప’లో నటిస్తోంది. కన్నప్పలో ఈమె ప్రభాస్ కు జోడిగా నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.
కాజల్ అగర్వాల్ లాస్ట్ ఇయర్ ‘భగవంత్ కేసరి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాలకృష్ణ ఖాతాలోకి వెళ్లింది.
కాజల్ అగర్వాల్.. తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత కథానాయికగా వెనుదిరిగి చూసుకోలేదు.