Kajal Aggarwal: ‘భారతీయుడు 2’ విషయంలో కాజల్ అభిమానులకు నిరాశే..

Fri, 12 Jul 2024-7:33 am,

కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చి 17 యేళ్లు అవుతోన్న ఇప్పటికీ అదే సోయగంతో   అలరిస్తోంది. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు మూవీస్ కు  దూరంగా ఉన్న .. కాజ‌ల్.. భారతీయుడు 2లో ఉందని వెళితే.. అభిమానులకు నిరాశే మిగిలింది.

భారతీయుడు 2లో కాజల్ పాత్ర లేదు. ఆమె రోల్ ను భారతీయుడు 3లో ఉందని చెబుతున్నారు. ఒక రకంగా కాజల్ అభిమానులకు ఇది నిరాశా కలిగించే అంశం. ఆచార్యలో కూడా ముందుగా కాజల్ ను తీసుకున్న .. సినిమా నిడివి.. కథా రీత్యా ఆమె పాత్రను తొలిగించారు.

అయితే.. ఈ రెండు సినిమాలకు గాను ఆమె రెమ్యునరేషన్ ను ఎక్కడా తగ్గకపోవడం విశేషం. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించిన ‘సత్యభామ’ ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.

మ్యారేజ్  త‌ర్వాత హీరోయిన్స్   కెరీర్‌కు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్టే. కానీ  కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రమే పెళ్లైన ఇప్ప‌టికీ చిత్రాలతో  బాక్సాఫీస్‌ను ర‌ఫ్ఫాడిస్తోంది.

ప్రస్తుతం కాజల్ చేతిలో ‘ఉమ’, ఇండియన్ 3 సినిమాలతో పాటు ‘కన్నప్ప’ చిత్రాలున్నాయి. అంతేకాదు కన్నప్పలో  ప్రభాస్ కు జోడిగా పార్వతి మాత పాత్రలో  నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link