Kajal, Gautam honeymoon pics: హనీమూన్‌లో కొత్త జంట.. కాజల్, కిచ్లు
ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతం కిచ్లు నూతన దంపతులు.. వివాహం జరిగిన నాటినుంచి తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూనే ఉన్నారు.
ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా కూడా సరికొత్త ఫొటోషూట్‌తో మెస్మరైజ్ చేస్తుంది ఈ కొత్తజంట. ఇప్పుడు ఈ జంట మాల్దీవుల్లో హనీమూన్ జరుపుకుంటోంది.
అక్టోబరు 30న అంగరంగవైభవంగా కాజల్, కిచ్లు వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వత ఈ కొత్త జంట ఇటీవల జరిగిన కార్వాచౌత్ వేడుకల్లో ( Kajal Aggarwal - Gautam Kitchlu photos ) పాల్గొన్నారు.
ఆ తర్వాత కూడా ఈ న్యూ కపుల్ - న్యూ ఫొటోషూట్‌లో పాల్గొని న్యూ స్టిల్స్‌తో అదిరిపోయే ఫొటోలు దిగి సందడి చేశారు.
ఇప్పుడు ఈ జంట హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. సెలబ్రిటీలందరి ఫేవరెట్ టూరిజం స్పాట్.. బ్యూటీఫుల్ హనీమూన్ లొకేషన్ అయిన మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ రిసార్ట్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ కాజల్..