Kajal Aggarwal: మరోసారి హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాను హీటెక్కించిన కాజల్ అగర్వాల్ .. ఇది మాములు డోస్ కాదండోయ్..

Wed, 09 Oct 2024-7:50 am,

కాజల్ అగర్వాల్.. హీరోయిన్ గా  ఎంట్రీ ఇచ్చి 17 యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.  పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు  దూరంగా ఉన్న .. కాజ‌ల్.. రీసెంట్ గా తను టైటిల్ రోల్ పోషించిన ‘స‌త్య‌భామ’ మూవీ‌తో ఆడియన్స్ ను పలకరించింది.

ఎన్నో ఆశలు పెట్టకున్న సత్యభామ సినిమా  కాజల్ అగర్వాల్  ఆశలపై నీళ్లు చల్లింది. ఈ చిత్రానికీ సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.

మ్యారేజ్  త‌ర్వాత హీరోయిన్స్  కెరీర్‌కు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్టే అని చెప్పాలి. కానీ  కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రమే మ్యారేజ్ తర్వాత  ఇప్ప‌టికీ చిత్రాలతో  బాక్సాఫీస్‌ను దడదడ లాడిస్తోంది.

ప్రస్తుతం కాజల్ ‘ఉమ’, ఇండియన్ 3, ‘కన్నప్ప’ సినిమాలున్నాయి. కన్నప్పలో ఈమె  ప్రభాస్ కు జోడిగా నటిస్తుంది. ఇక ఈమె కమల్ హాసన్ కు జోడిగా నటిస్తోన్న ‘ఇండియన్ ’ మూవీ ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది.  

కాజ‌ల్ అగ‌ర్వాల్  గతేడాది ‘భ‌గ‌వంత్ కేస‌రి’ సినిమాతో మంచి విజయాన్నే తన ఖాతాలో వేసుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాల‌కృష్ణ ఖాతాలోకి  వెళ్లింది.

కాజల్ అగర్వాల్..  తేజ దర్శకత్వంలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన 'లక్ష్మి కళ్యాణం'మూవీతో టాలీవుడ్  సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది.  ఆ త‌ర్వాత హీరోయిన్ గా  వెనుదిరిగి చూసుకోలేదు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link