Kajal Aggarwal: గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేసిన కాజల్ అగర్వాల్.. పెళ్లైనా తగ్గని మిత్రవింద దూకుడు..

Thu, 12 Sep 2024-3:50 pm,

తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా అదే దూకుడును  మెయింటెన్ చేస్తోంది.

తేజ డైరెక్షన్ లో  వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్. 

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది.

పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తోంది. రీసెంట్ గా సత్యభామ వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలరించింది. 

కాజల్ అగర్వాల్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా అలరించింది.

లాస్ట్ ఇయర్ 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. తొలిసారి ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link