Kalki 2898 AD 1st Day Collections: ఆ ఏరియాలో ఫస్ట్ డే ఆదిపురుష్ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’..

Fri, 28 Jun 2024-3:17 pm,

హిందీ బెల్ట్  ఏరియాలో ఫస్ట్ డే ఆదిపురుష్ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ. అంతేకాదు నాన్ హాలీడే రిలీజైన ఈ సినిమా అక్కడ మంచి వసూళ్లనే రాబట్టడం విశేషం.

 

 

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. మన దేశంలో హిందీలో ఫస్ట్ డే  రూ. 53.95 కోట్ల నెట్ వసూళ్లతో దక్షిణాది డబ్బింగ్ హిందీ సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

 

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘బాహుబలి 2’. ఈ చిత్రం హిందీ వెర్షన్ లో  ఫస్ట్ డే రూ.41 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సౌత్ డబ్బింగ్ సినిమాల్లో రెండవ స్థానంలో ఉంది.

 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్షన్ లో  తెరకెక్కిన చిత్రం హిందీ మార్కెట్ లో ఫస్ట్ డే  రూ.37.25 నెట్ వసూల్లతో మూడవ స్థానంలో ఉంది. 

 

ప్రభాస్ హీరోగా అమితాబ్, కమల్ హాసన్ నటించిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ గురువారం విడుదలైన  ఈ సినిమా హిందీ వెర్షన్ రూ. 22.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి 4వ ప్లేస్ లో నిలిచింది.

 

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సాహో’. ఈ సినిమా ఫస్ట్ డే హిందీ వెర్షన్ మన దేశంలో రూ.24.4 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి 5వ స్థానంలో నిలిచింది.

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో   తెరకెక్కిన చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR). ఈ సినిమా హిందీ వెర్షన్  మన దేశంలో ఫస్ట్ డే రూ. 20.07 కోట్ల నెట్ వసూల్లతో 6వ ప్లేస్ లో ఉంది.

 

రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.O’. ఈ సినిమా హిందీలో ఫస్ట్ డే  రూ. 19.74 కోట్ల నెట్ వసూల్లతో తాజాగా కల్కి మూవీ రాకతో  7వ స్థానంలో నిలిచింది.

 

 

 రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్.  ఈ సినిమాకు హిందీలో షారుఖ్ ‘డంకీ’ మూవీ గట్టి పోటీ ఉన్నా.. అక్కడ ఫస్ట్ డే రూ. 15.75 కోట్ల నెట్ వసూల్లతో 8వ స్థానంలో ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link