Prabhas: కెరీర్ లో మరో మైలు రాయిని అధిగమించిన ప్రభాస్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే విషయం..

Tue, 12 Nov 2024-11:51 am,

Prabhas@22 Years: ప్రభాస్  ఈ పేరు చాలు తెలుగు సినిమాను ప్యాన్ ఇండియా స్థాయికి చేర్చిన నటుడు. అంతేకాదు మన దేశంలో ప్యాన్ ఇండియా సినిమాలకు రూట్ మ్యాప్ ఇచ్చిన కథానాయకుడు అని చెప్పాలి. హీరోగా సరిగ్గా  22 ఏళ్ల ముందు వెండితెరపై కనిపించాడు.

2002, నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా "ఈశ్వర్" ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి చిత్రమే ఘన విజయం సాధించి ప్రభాస్ అప్రతిహత నట పునాదులు వేసింది.  ఈశ్వర్ లో ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ప్రభాస్ ను చూసి ఫ్యూచర్ స్టార్ అని అప్పుడే డిక్లేర్ చేశారు చాలా మంది క్రిటిక్స్.  వారి అంచనాలు మించేలా స్టార్ గా ప్రపంచ ఖ్యాతిని దక్కించుకుంటున్నారు ప్రభాస్.

'రాఘవేంద్ర', 'వర్షం', 'అడవిరాముడు', 'చక్రం', 'ఛత్రపతి', 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా' 'బుజ్జిగాడు' 'బిల్లా', 'ఏక్‌నిరంజన్‌', 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', 'రెబల్‌', 'మిర్చి' వరకు ప్రభాస్ జర్నీ ఒక ఫేజ్ అయితే బాహుబలితో ఆయన పాన్ ఇండియా స్టార్ గా కొత్త ప్రయాణం మొదలైంది. 

బాహుబలి రెండు భాగాల తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ప్రభాస్ రెండు సార్లు(బాహుబలి 2, కల్కి 2898 ఎడి) వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలను ఖాతాలో వేసుకోవడం ఒక రేర్  ఫీట్ అని చెప్పాలి.  ఓవ‌ర్‌సీస్ మార్కెట్‌లో ప‌ది మిలియ‌న్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన ఫస్్  హీరోగా ప్ర‌భాస్‌ నిలిచారు.

ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘ది రాజా సాబ్’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ సినిమా…ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్.

వీటితో పాటు హోంబలే ఫిలింస్ ప్రశాంత్ వర్మ తో పాటు మరో  రెండు  చిత్రాలను ప్రభాస్ తో నిర్మించనున్నట్లు ప్రకటించింది. ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించడం పక్కా అని చెబుతున్నారు అభిమానులు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link