Kalki 2898 AD OTT News: ‘కల్కి’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..
రెబల్ స్టార్ ప్రభాస్..ఇది పేరు కాదు ఇట్స్ బ్రాండ్. ‘కల్కి 2898 AD’ మూవీతో పూటకో రికార్డును బ్రేక్ చేస్తున్నాడు. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా $19 మిలియన్స్ డాలర్స్ రాబట్టి బాహుబలి 2 తర్వాత రెండో ప్లేస్ లో నిలిచింది.
అంతేకాదు కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 1100 కోట్ల గ్రాస్ (రూ. 555 కోట్ల షేర్) వసూల్లతో దూసుకుపోతుంది. ఈ వీకెండ్ తో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగుస్తుందనే చెప్పాలి.
ఏది ఏమైనా బాహుబలి 2 తర్వాత సలార్ తో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రభాస్.. ‘కల్కి 2898 AD’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకున్నాడు. అంతేకాదు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు కల్కి రెండో వెయ్యి కోట్ల మూవీ.
తాజాగా కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషలకు సంబంధించి ఆగష్టు 15 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా విడుదలైన ఏడు వారాలకు ఈ సినిమాను ఓటీటీలో ప్రదర్శించేలా ముందే ఒప్పందం చేసుకున్నారు. ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి ఈ రోజున ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం.
ప్రభాస్ ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఈ యేడాది చివర్లో మంచు విష్ణుతో చేస్తోన్న ‘కన్నప్ప’ డిసెంబర్ లో విడుదల కానుంది. అటు మారుతి దర్శకత్వంలో చేస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం’, ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ ఈ యేడాది చివర్లో పట్టాలెక్కనుంది. అటు హను రాఘవపూడితో చేస్తోన్న ఫౌజీ, అటు సిద్ధార్ధ్ ఆనంద్ చిత్రాలు లైన్ లో ఉన్నాయి.