Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ సహా ఫస్ట్ వీకెండ్ లో ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ చిత్రాలు ఇవే..

Mon, 01 Jul 2024-4:04 pm,

కల్కి 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే నార్త్ అమెరికాలో $10.9 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ లో ఉంది.

బాహుబలి 2 నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్ లో $ 10.43 యూఎస్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి తాజాగా కల్కి రాకతో రెండో ప్లేస్ లో నిలిచింది.

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో $ 9.5 యూఎస్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది.

షారుఖ్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీ ఫస్ట్ వీకెండ్ ముగిసే వరకు $9.49 యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి టాప్ 4లో నిలిచింది.

షారుఖ్ హీరోగా నయనతార, దీపికా పదుకొణే హీరోయిన్లుగా నటించిన మూవీ ‘జవాన్’. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర $ 7.49 మిలియన్ యూఎస్ డాలర్స్ తో టాప్ 5 ప్లేస్ లో ఉంది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సినిమా ‘యానిమల్’. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి $6.52 మిలిన్ యూఎస్ డాలర్స్ తో టాప్ 6 ప్లేస్ లో నిలిచింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link