Disha Patani: బ్లాక్ ది హాటెస్ట్ అని.. మరోసారి రుజువు చేసిన దిశా పటానీ.!

Wed, 28 Aug 2024-6:37 pm,

బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో యువతను మెస్మరైజ్ చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా ఈ అమ్మడి డిజైనర్ దుస్తులు ఎప్పటికప్పుడు అభిమానులలో కాక పుట్టిస్తూ ఉంటాయి. యువతలో నిత్యం హాట్ ఫోజుల తో హాట్ టాపిక్ గా మారుతున్న ఈమె, డిజైనర్ సహా అల్ట్రా మోడల్ బ్యూటీగా కూడా దుమారం రేపుతూ ఉంటుంది.

ఎలాంటిదైనా సరే అక్కడ ఆమె మార్క్ ఎలివేషన్ తప్పనిసరి , ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి సెగలు పుట్టించే ఔట్ ఫిట్ తో చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.  తాజాగా డార్క్ బ్లూ డ్రెస్ లో అందాలతో బ్లాస్టింగ్ చేసేసింది దిశా పటాని. తాజాగా డార్క్ బ్లూ కలర్ లెదర్ అవుట్ ఫిట్ లో ఒదిగిన వైనం అందరి చేత వావ్ అనిపిస్తోంది. అమ్మడి శరీర కొలతలకి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ గా హైలెట్ అవుతోంది. టోన్డ్ బాడీ పై డార్క్ బ్లూ మరింత షైనింగ్ ని జోడించింది అని చెప్పవచ్చు. 

క్లీవేజ్ బ్యూటీ సైతం అంతే హైలెట్ అవుతోంది.  ఈ అమ్మడి మేకప్ , కేశాలంకరణ అన్నీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా వివిధ భంగిమలలో సొగసరి కెమెరాలకు ఫోజులిచ్చిన వైనం ఆకట్టుకుంటుంది. 

ప్రస్తుతం దిశా పటానీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈమె ఫోటోలపై అభిమానులు ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. ఎవరి స్టైల్ లో వారు ప్రపోసల్స్ గుప్పిస్తున్నారు. ఎలెగెంట్ బ్యూటీ, మై క్రష్,  మై ఎవ్రీథింగ్, మై వరల్డ్ అంటూ ఎవరికి తోచినట్లు వారు ఈమె అందానికి ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు.. అంతేకాదు బ్లాక్ ద హాటెస్ట్ కలర్ అంటూ మరో యూజర్ కామెంట్ పోస్ట్ చేశారు. 

దిశాపటాని చిత్రాల విషయానికి వస్తే.. లోఫర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్న ఈమె ఇటీవల ప్రభాస్ కల్కిలో కూడా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో భారీ ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాదు వరుస ఆఫర్లు కూడా అందుకుంటున్నట్లు సమాచారం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link