Kangana Ranaut Photos: సోదరుడి వివాహ వేడుకలో కంగనా రనౌత్ సందడి
గత కొన్ని రోజులుగా వివాదాలతో బిజీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన సోదరుడి వివాహ వేడుక (Kangana Ranaut brother Wedding)లో సందడి చేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా అక్షత్ రనౌత్, రీతూల డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా జరిగింది. కంగనా, సోదరి రంగోలీలు పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోల (Kangana Ranaut Brother Wedding Photos)ను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. సోదరుడి భార్య రీతూను కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఫ్యామిలీ ఫొటోలను కంగనా, రంగోలీ పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలను కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ తమ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లలో షేర్ చేసుకున్నారు.
Also Read : Deepika Padukone: దీపికకు భారీ రెమ్యునరేషన్.. తెలిస్తే షాక్!