Kareena Kapoor: పేరుకి ఎక్కువ రెమ్యునరేషన్.. కానీ సినిమాలు దొరకడమే కష్టం!

Mon, 22 Jul 2024-7:24 pm,

కరీనాకపూర్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా…కొనసాగుతోంది ఈ నటి.  ప్రస్తుతం హిందీ హీరోయిన్స్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో కరీనా కపూర్ ఒకరు.

ఈ క్రమంలో ఈ మధ్య ఈ హీరోయిన్ ఓ ఆంగ్ల మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ.. రెమ్యునరేషన్స్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్స్ లిస్టులో ఈ హీరోయిన్ బాగం కావడంపై స్పందించారు.

డబ్బు కంటే పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ‘దాదాపు రూపాయి 10 కోట్ల నుంచి రూపాయి పదకొండు కోట్ల..వరకు సంపాదిస్తున్న తారల్లో నేను ఒకదాన్ని ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించ కేవలం పారితోషికాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు అంగీకరించను..సినిమా ఎలాంటిది అందులో నా పాత్ర ఏమిటి.. అది సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే విషయాలను పరిగణంలోకి తీసుకుంటా.. అందుకే నాకు సినిమాలు దొరకడం కష్టమవుతోంది’ అని చెప్పుకొచ్చారు 

అనంతరం తన భర్త సైఫ్ అలీ ఖాన్ గురించి మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత ఎంతో మారాము. ఒకరికొకరు తోడుగా ఉండటం అర్థం చేసుకున్నాము’ అని చెప్పుకొచ్చింది.   

‘షూటింగ్స్ కారణంగా.. కలిసి టైం స్పెండ్ చెయ్యడానికి వీలు ఉండద.  ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఒకరినొకరు చూసుకోవడం కూడా సమయం దొరకదు. వ్యక్తిగత.. వృత్తిపరమైన.. జీవితాలకు న్యాయం చేయడం అంత సులభం కాదు. అందుకే వీళ్ళు దొరికినప్పుడు కలిసి సరదాగా గడుపుతాను’ అని తెలిపారు. ఇక ఈ మధ్యనే క్రూ  సినిమాలో కనిపించిన ఈ హీరోయిన్ త్వరలో సింగం అగైన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానుంది  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link