Karthika masam 2024: కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటున్నారా..?.. ఈ తప్పులు అస్సలు చేయోద్దు..
కార్తీకమాసంను హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివకేశవులకు అనుగ్రహాంకోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ప్రతిరోజు కూడా దీపాలు వెలిగిస్తారు.
ఏడాదిలో మనం చేసుకున్న పుణ్యం ఒక దిక్కు. కార్తీక మాసంలో చేసుకున్న పుణ్యం మరో దిక్కని పండితులు చెబుతుంటారు. అందుకు కార్తీకంలో ఎంతో మంతి యాత్రలు, వ్రతాలు చేస్తుంటారు.
అయితే.. కార్తీక మాసంలో చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. దీని వల్ల ఆరోగ్యం పాడవదని నిపుణులు చెబుతున్నారు.
కార్తీకంలో యాభై ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఉపవాసాలు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. అలాగే షుగర్, బీపీల వంటి సమస్యలు ఉన్నవారు మాత్రం ఉపవాసాలకు దూరంగా ఉండాలంటారు.
ఒక వేళ ఉపవాసం ఉన్న కూడా సాత్వీకమైన ఆహారం, పండ్ల రసాలు, పాలు వంటివి తీసుకుంటు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా..దీని వల్ల శరీరం అలసిపోదని చెబుతుంటారు.
ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేసేవారు ఉపవాసాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. దీని వల్ల కొందరిలో తలతిరగడం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. మరికొందరు ఉపవాసాలు ఉంటేనే దేవుడు అనుగ్రహిస్తాడని ఎక్కడలేదని కూడా కొంత మంది చెబుతుంటారు.