Karthika masam 2024: కార్తీక మాసంలో ఉసిరి దీపం విశిష్టత.. ఇలా వెలిగిస్తే అఖండ ధనయోగంతో పాటు సొంతింటి కల సాకారం..
కార్తీకంలో ఉసిరి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దీపం పెట్టేటప్పుడు.. నెలపై తమలపాకు లేదా బియ్యం వేసి దానిపై పసుపు, కుంకుమ పెట్టి దానిపైన మాత్రమే ఉసిరి దీపం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే శివ, నారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
కార్తీక మాసంను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో మనం చేసిన పూజలు, వ్రతాలు వందరెట్ల గొప్ప ఫలితాలు ఇస్తాయని చెబుతుంటారు.ఈ నెల అంతా కూడా శివ, కేశవుల్ని ఎక్కువగా పూజించుకుంటారు.
అయితే.. కార్తీక మాసంలో చాలా మంది ఉసిరి దీపంను ఎక్కువగా వెలిగిస్తారు. ఉసిరి దీపంను వెలిగించడం వెనుక అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉసిరిని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు.
ఉసిరి చెట్టుతో సకల దేవతలు కూడా నివాసం ఉంటారంట. అందుకే కార్తీకంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి, ఉసిరి మీద దీపారాధన కూడా చేస్తారు. దీని వల్ల జీవితంలో అఖండ ధనయోగం కల్గుతుందని చెబుతుంటారు.
ఉసిరికి ధనాన్ని ఆకర్శించే గుణం కూడా ఉంటుందంట. అందుకే కార్తీకంలో ఎక్కువగా ఉసిరి చెట్టును పూజించడంతో పాటు, తులసీ వివాహాంలో కూడా ఉసిరిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.
ఇదిలా ఉండగా.. ఉసిరి మీద దీపం వెలిగించడంతో పాటు, ఉసిరి పండుతో పాటు పండితులకు దానంగా ఇస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు. అఖండ ధనయోగంతో పాటు వాహాన యోగం కల్గుతుందని పండితులు చెబుతుంటారు.