Karthika Purnima: కార్తిక మాసం ఎందుకు పవిత్రం ? కార్తిక పౌర్ణమినాడే 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు ?
365 వత్తులు ఎందుకు వెలిగించాలి ( 365 cotton wicks ) ? సంవత్సరం పొడవునా దేవునికి దీపారాధన చేయడం వీలుకాని వారు కార్తీకమాసంలో పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినదానితో సమానం అని చెబుతుంటారు పెద్దలు. ఈ మాసంలో నది లేదా కొలనులో స్నానం ఆచరించడం కూడా చాలా మంచిది.
ఈ మాసంలో నది లేదా కొలనులో స్నానం ఆచరించడం కూడా చాలా మంచిది. కొండలు, కోనలు, అడవుల గుండా నదులు ప్రవహిస్తూ ఉండటం వల్ల ఆయుర్వేద గుణాలు సంతరించుకుంటాయి. ఆ నది నీటియందు స్నానం ఆచరించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నదిలో అనిర్వచనీయమైన విద్యుత్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది.
ఉపవాస దీక్ష ( Karthika purnima fasting timings ) : శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిరాహారం మరోయోగం. కొందరు ఉపవాసాన్ని రోజు మొత్తంలో ఓసారి ఫలాహారాన్ని స్వీకరించి ఏకభుక్తంగా నిర్వహిస్తారు. మరికొందరు నక్తం చేస్తుంటారు. అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం. ఇలా కార్తీక సోమవారాలు, కార్తీక శనివారాలు, ఏకాదశి, కార్తీక పౌర్ణమి రోజుల్లో ఉపవాస దీక్ష శరీరానికి మేలు చేస్తుంది.
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసి, వన భోజనాలు చేసినట్లైతే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక వన భోజనాలు - అంతరార్థం : పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడిపడి ఉందని చెప్పడానికి వృక్షోరక్షతి రక్షితః అన్న నానుడి ప్రచారం చేసేందుకు పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల అంతస్సూత్రం. భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికి ఉన్న ప్రాధాన్యత అంత, ఇంత కాదు. పవిత్రమైన ఔషధగుణాలతో కూడిన వృక్షాల క్రింద భోజనం చేయడం ద్వారా, ఆ వృక్షగాలిని పీల్చడం ద్వారా సూక్ష్మీకృతమైన ఆ వృక్ష శక్తి మానవునికి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
కార్తిక వన భోజనాలలో భాగంగా సామూహికంగా భోజనాలు చేయడం వల్ల పదిమందిలో మెలిగే పద్ధతులు తెలుస్తాయి. ఎలా తినాలో, ఎలా తినకూడదో తెలుస్తుంది. భోజనాలు స్వీకరించే ముందు హరినామ స్మరణ చేయడం వల్ల స్వీకరించే పదార్థాలు అన్ని ఆ భగవంతుని అనుగ్రహం అని మరోమారు గుర్తు చేసినట్లు అవుతుంది.