Kartika Amavasya 2024: ఏడాదికి ఒకసారి.. కార్తీక అమావాస్య.. ఈసారి ఇలా చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయం!
అలాగే కొంతమంది అయితే పూర్వీకుల అనుగ్రహం కోసం అమావాస్య తిథి (amavasya 2024) సమయాల్లోనే పిండ ప్రదానం చేసి తర్పణం సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల పితృ దోషాలు ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుందని ఒక నమ్మకం.. ఇదిలా ఉంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు మరేంతో ప్రాముఖ్యత ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీకమాసంలో వచ్చే అమావాస్య(kartika amavasya 2024) ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీన ఈ అమావాస్య వచ్చింది. అయితే డిసెంబర్ మొదటి రోజు ఈ అమావాస్య రావడం మతపరంగా విశేషమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుండట.
కార్తీక అమావాస్య రోజున హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుందట. దీనికి తోడు ధనలక్ష్మి(lord lakshmi) అనుగ్రహం కూడా లభించి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయట. అలాగే ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
తెలుగు పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది కార్తిక అమావాస్య కృష్ణపక్షం అమావాస్య తిథి(kartika amavasya 2024 date and time)నవంబర్ 30వ తేదీన వచ్చింది. అయితే ఈ అమావాస్య నవంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆరంభం అవుతుంది. ఆ తర్వాత ఆ మరుసటి రోజు డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం 11 గంటలకు పూర్తవుతుంది.
వేద జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అమావాస్యను(amavasya 2024) నవంబర్ 30వ తేదీ జరుపుకోకుండా.. డిసెంబర్ ఒకటవ తేదీ జరుపుకోవడం ఎంతో శుభప్రదమని వారంటున్నారు. అలాగే లక్ష్మీదేవిని పూజించేవారు ఈ డిసెంబర్ ఒకటో తేదీనే పూజించడం చాలా శుభప్రదమని నిపుణులు తెలుపుతున్నారు.
కార్తిక అమావాస్య రోజు ఉదయాన్నే నిద్ర లేచి నదీ స్నానాన్ని ఆచరించి దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి పూజలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఈ పూజలో భాగంగా కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలో ఉన్నత స్థానాన్ని ఎదుగుతారు.
ముఖ్యంగా కార్తీక అమావాస్య (kartika amavasya 2024) రోజున లక్ష్మీదేవికి సంబంధించిన 108 నామాలు పాటించడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిధులు చెబుతున్నారు. ఇక డబ్బు పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో తొలగిపోతాయి.