Karwa chauth 2022 : కర్వాచౌత్ స్పెషల్.. కొత్త జంటల సందడి.. కత్రినా-విక్కీ జోడి పిక్స్ వైరల్

Fri, 14 Oct 2022-7:43 am,

బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ ఇలా కర్వా చౌత్ సందర్భంగా తన భర్తతో కలిసి సందడి చేసింది. రోహన్ ప్రీత్ సింగ్ కోసం నేహా కక్కర్ ఇలా వ్రతాన్ని చూసి చివరకు ఫోటోలకు పోజులు ఇచ్చింది.

బాలీవుడ్ క్రేజీ జంటలో వరుణ్‌ ధావన్ నటాషా దలాల్ ఉంటుంది. తన భర్త మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకుంటుంది నటాషా. తన భర్త గురించి రొమాంటిక్ ముచ్చట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా కర్వా చౌత్‌లో భాగంగా ఇలా ఈ జోడి సందడి చేసింది.

నాగిని భామ మౌనీ రాయ్ ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకుంది. మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్ కోసం ఈ కర్వా చౌత్ వ్రతాన్ని చేసింది. ఈ ఫోటోల్లో జల్లెడలో తన భర్త మొహాన్ని చూసి మౌనీ రాయ్ మురిసిపోతోంది.

కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి గత ఏడాది డిసెంబర్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ జోడికి ఇదే మొదటి కర్వా చౌత్. దీంతో కత్రినా ఎంతో ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని చేపట్టింది. ఇక ఈ ఫోటోల్లో కత్రినా విక్కీ జోడి మరింత అందంగా కనిపిస్తోంది.  

Karwa chauth 2022 : కర్వాచౌత్‌కు ఉత్తరాదిన ఉండే ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అశ్వినీ మాసంలో పౌర్ణమి వచ్చిన నాలుగు రోజుల తరువాత ఈ కర్వా చౌత్‌ను జరుపుకుంటారు. భర్త యోగక్షేమాల కోసం భార్యలు చేసే వ్రతమే కర్వా చౌత్. ఉదయం అంతా కూడా ఉపవాసాలు ఉండి సాయంత్రానికి ఇలా జల్లెడ లాంటి వస్తువులో భర్త మొహాన్ని చూసి వ్రతాన్ని పూర్తి చేస్తారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link