Karwa Chauth 2023: ఈ వ్రతం ఉండాలంటే ముందు ఈ సూచనలు పాటించాల్సిందే
కర్వా చౌత్ ఆచరించే మహిళలు వ్రతానికి ఒకరోజు ముందు బంగాళదుంపతో చేసే పదార్ధాలు తింటే అదనపు బలం వస్తుంది.
కర్వా చౌత్ వ్రతం ఆచరించడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి బలం వస్తుంది. ముఖ్యంగా డీ హైడ్రేషన్ సమస్య ఉండదు. ఎనర్జీ వస్తుంది.
ఇక మరో బెస్ట్ ఫుడ్ పన్నీరు. పన్నీరు తీసుకోవడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. బలహీనం దూరమౌతుంది. కర్వాచౌత్ ఆచరించడానికి ఒకరోజు ముందు పన్నీరు కూర తింటే మంచిది.
మీరు కూడా ఈ వ్రతం ఆచరించాలనుకుంటే ముందుగా డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్రతానికి ముందు డైట్‌లో డ్రై ఫ్రూట్స్ చేర్చాలి. దీనివల్ల నీరసం ఉండదు. బలం చేకూరుతుంది.
కుంకుమ పాలలో ప్రోటీన్లు అత్యద్భుతంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని నీరసం కాకుండా చేస్తాయి. అందుకే వ్రతం ఆచరించే ముందు కుంకుమ పాలు తాగడం మంచిది.