Karwa Chauth 2024: ఈరోజు రాత్రి ఇలా చేస్తే మీ దశ తిరగడం ఖాయం..!
కర్వా చౌత్.. మన హిందువుల ప్రకారం ఈ పండగను.. అట్ల తద్ది అని పిలుస్తారు. ఈరోజు రాత్రి ఇలా చేశారంటే మాత్రం కచ్చితంగా మీ దశ తిరిగినట్లే అని పండితులు కూడా చెబుతున్నారు. మరి ఈరోజు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
అట్లతద్ది.. ఈ పండుగను ఊయల పండుగ లేదా గోరింటాకు పండుగ అని కూడా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలలో ఈ నెల 20వ తేదీన అనగా ఆదివారం రోజు అట్లతద్ది పండుగ జరుపుకోబోతున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత స్త్రీలు ఒకే చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి సంతోషంగా ఊగుతూ వేడుకలు నిర్వహిస్తారు.
ముఖ్యంగా తమ భర్త దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తూ, ఉపవాస దీక్షలను కూడా కొనసాగిస్తారు. ఇదే పండుగను ఉత్తర భారతంలో కర్వా చౌత్ అనే పేరుతో జరుపుకుంటారు. అక్కడ వివాహిత మహిళలు చంద్రోదయం వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉపవాస దీక్షలు చేపడతారు .ఈ సందర్భంగా అట్లతద్ది రోజు రాత్రి మహిళలు పూజలు నిర్వహించిన తర్వాత జల్లెడలో చంద్రుడిని చూసి ఆ తర్వాత తమ భర్త ముఖాలను చూసి వారి ఆశీర్వాదం తీసుకుంటారు.
ఈరోజు రాత్రి ధూప ,దీప నైవేద్యాలతో గౌరీదేవిని పూజించాలి. మొదట గణేషుడిని ఆరాధించి ఆ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. చంద్రుని దర్శనం చేసుకొని మళ్లీ గౌరీ పూజ చేసి, పది అట్లను నైవేద్యంగా సమర్పించాలి. ముత్తైదువులకు కూడా 10 రకాల పండ్లు 10 అట్లు వాయనంగా సమర్పించాలి.
చంద్రుడిని ఆరాధించడం వల్ల చంద్రునిలో ఉండే శక్తి అనుగ్రహం వల్ల సౌభాగ్యంగా ఉంటామని తమ కుటుంబంలో సుఖశాంతులు వెళ్లి విరుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా అట్లను సమర్పించడం వల్ల కుజదోషం తొలగిపోతుందని, అష్టైశ్వర్యాలు తులతూగుతాయని చెబుతున్నారు. అంతేకాదు గర్భధారణ సమస్యలు కూడా తొలగిపోతాయని సమాచారం. ఈరోజు పూజా నియమాలతో గౌరీదేవిని పూజించడం వల్ల దశ తిరుగుతుందని సమాచారం.