Vicky Katrina Wedding Venue: విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ పెళ్లి జరగబోయేది ఇక్కడే!
విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ ల పెళ్లి వేడుక.. రాజస్థాన్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ కోటలో జరగనుంది.
విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. అయితే వారి డేటింగ్, పెళ్లి వేడుక గురించి వారిద్దరూ ఇప్పటికీ బహిరంగ ప్రకటన చేయలేదు. పెళ్లి తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
విక్కీ – కత్రినాల హల్దీ వేడుక కోసం వెడ్డింగ్ ప్లానర్స్ కోటను అందంగా ముస్తాబు చేశారు.
రాజస్థాన్ లోని 200 ఏళ్ల నాటి పురతన కోట.. విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ పెళ్లికి వేదిక అయ్యింది.
తన ఇంటికి రాబోయే కోడలు కోసం విక్కీ కౌశల్ తల్లి.. మహిళలతో ప్రత్యేక సంగీత్ ను నిర్వహించనున్నారని సమాచారం.