Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి `కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్`.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!
కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆయన సన్ గ్రూప్ అధినేతగా ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ వ్యవస్థాపకుడి వ్యవహరిస్తున్నారు. కానీ బాధ్యతలు మొత్తం కూతురు కావ్య మారన్ చూసుకుంటున్నారు.
కళానిధి మారన్ ఫోర్బ్స్ భారతీయ బిలియనీర్ల జాబితాలో 82వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం సంపద 2.85 బిలియన్ డాలర్లు అంటే రూ.23,000 కోట్లు.
కళానిధి మారన్ ఓ పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్' అంటూ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించింది. ఆయనకు టీవీ ఛానెల్స్, న్యూస్ పేపర్లు, ఎఫ్‌ఎమ్ రేడియో స్టేషన్లు, డీటీహెచ్ వ్యాపారాలు, చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉన్నాయి.
అంతేకాకుండా స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్‌లో కూడా కళానిధి మారన్ 2010 నుంచి 2015 వరకు వాటాను కలిగి ఉన్నారు.
కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధి మనవడు. కావ్య మారన్ తాత, కళానిధి మారన్ తండ్రి కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్.
కళానిధి మారన్ తమ్ముడు దయానిధి మారన్ తమిళనాడులో సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు. కళానిధి మారన్ భార్య పేరు కావేరి.
తండ్రి నుంచి బిజినెస్ట్ టెక్నిక్స్‌ను నేర్చుకున్న కావ్య మారన్.. సన్‌రైజర్స్ సీఈఓగా ఉన్నారు. ఆమె ఆస్తి విలువ 409 కోట్ల రూపాయలుగా ఉంది.