Keerthy Suresh-Suhas: కీర్తి సురేష్ తో సుహాస్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు
కీర్తి సురేష్ గురించి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నేను శైలజా.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్. ఆ తరువాత వరుస సినిమాలతో.. బిజీగా మారిన కీర్తి సురేష్.. మహానటి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
మహానటి సినిమా కీర్తి సురేష్ కి తెలుగులో.. ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టింది. అంతేకాదు నానితో కీర్తి సురేష్ చేసిన దసరా.. సినిమా కూడా ఆమెకు నటన పరంగా.. వందకి వంద మార్కులు వేయచ్చింది. ఇక ప్రస్తుతం సౌత్ ఇండియాతో పాటు.. బేబీ జాన్ అనే సినిమాతో నార్త్ ఇండియాలో.. కూడా అడుగుపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేయనుంది ఈ హీరోయిన్.
ఈ క్రమంలో కీర్తి సురేష్ త్వరలోనే.. కలర్ ఫోటో హీరో సుహాస్ తో..ఉప్పుకప్పురంబు అనే ప్రాజెక్ట్ చేయనంది. అమెజాన్ ప్రైమ్ విడుదల చేస్తున్న ఈ చిత్రంపై.. ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఉప్పు కప్పురంబు సినిమా షూటింగ్ పూర్తి కావడంతో.. సెలబ్రేషన్స్ జరుపుకున్నారు చిత్ర యూనిట్.
కీర్తి సురేష్, సుహష్ ఫోటోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఒక ఫోటోలో.. సుహాస్ ని హగ్ చేసుకుని.. కీర్తి సురేష్ కనిపించింది. మరికొన్ని ఫోటోలలో.. ఈవెంట్ ని సెలబ్రేట్ చేస్తూ.. ఉప్పు కప్పురంబు టీం మొత్తం ఉన్నారు.
శశి దర్శకత్వంలో.. రానున్న ఈ ఉప్పు కప్పురంబు సినిమాని..ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వసంత్ మురళీకృష్ణ మరింగంటి కథ అందించారు. ముంబై వేదికగా జరిగిన ప్రైమ్ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు.