Keerthy Suresh: చందమామలా మెరిసిపోతున్న మహానటి.. ఫోటో వైరల్..!
మహానటి కీర్తిసురేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ మేనక కూతురిగా 2000 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె, మొదట్లోనే తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈమె వెండితెరకు తిరిగి వచ్చి హీరోయిన్ పాత్రలో నటించడం మొదలుపెట్టింది . అలా 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది కీర్తి సురేష్.
ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈమె 2016లో నేను శైలజ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఈమె భారీ పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అలా తెలుగు, తమిళ్ , మలయాళం చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ఇకపోతే 2018 లో వచ్చిన మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు ను సొంతం చేసుకొని, అతి తక్కువ సమయంలోనే నేషనల్ అవార్డు అందుకున్న హీరోయిన్గా రికార్డు సృష్టించింది. గ్లామర్ షో కి దూరంగా ఉండే కీర్తి సురేష్ , మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో గ్లామర్ డోస్ పెంచేసి మొదటిసారి అందరినీ ఆకట్టుకుంది.
ఇక సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కీర్తి సురేష్ . ముఖ్యంగా రోజుకొక హాట్ ట్రీట్ ఇస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ ఈమె ఇప్పుడు తాజాగా మరో ఫోటోషూట్ తో అందరిని అలరించింది.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది కీర్తి సురేష్. బ్లూ కలర్ పరికిణీ లో మరొకసారి అందాల సోయగంతో చందమామలా కనిపించి అందరిని ఆకట్టుకుంది కీర్తి సురేష్. ప్లేయిన్ కలర్ పరికిణి, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అందుకు భిన్నంగా నెట్టేడ్ వర్క్ చున్నితో తన అందాలను దాచేసింది. నడుము అందాలతో మరొకసారి గిలిగింతలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలకు అభిమానులు ముచ్చట పడిపోతున్నారు నెటిజెన్లు లైక్ షేర్ చేస్తూ సరదా కొంటె కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కీర్తి సురేష్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.