Keerthy Suresh: పెళ్లయిన హీరోతో ప్రేమ రూమర్స్.. చిరంజీవి కన్నా అతనే గొప్ప అంటున్న కీర్తి సురేష్..!

Sun, 04 Aug 2024-11:44 pm,

కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో.. రామ్ హీరోగా వచ్చిన నేను శైలజా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్. ఆ తరువాత.. నానితో చేసిన నేను లోకల్ చిత్రం కూడా కీర్తి సురేష్ కి మంచి విజయం సాధించి పెట్టింది.

కీర్తి సురేష్ స్టార్ డమ్ ని తెలుగులో మార్చేసిన చిత్రం మాత్రం మహానటి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించి.. నటిగా కీర్తి సురేష్ కి ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమాకి..గాను కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు సైతం వచ్చింది. ఈ సావిత్రి బయోపిక్ లో నిజంగానే సావిత్రిని మైమరిపించేలా నటించి ఆ పాత్రకు జీవం పోసింది ఈ హీరోయిన్.

కాగా మహానటి తర్వాత కీర్తి సురేష్ కి వరసగా తొమ్మిది ఫ్లాపులు వచ్చాయి. అయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ మధ్యనే నానితో దసరా సినిమాతో.. మళ్ళీ విజయం సాధించి.. వరస ప్రాజెక్టులో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ మధ్య కీర్తి సురేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమెను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నాయి.   

గతంలో కీర్తి సురేష్ తమిళ హీరో విజయ్ తో ప్రేమలో.. ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి‌ అయితే అవి కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్.. విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ ని ఎవరు గొప్ప డాన్సర్లు అంటూ.. ఒక ప్రశ్న అడగసాగారు. వాటికి సమాధానాలు ఇస్తూ.. వచ్చిన కీర్తి సురేష్ ఫైనల్ గా చిరంజీవి, దళపతి విజయ్‌ లో ది బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా విజయ్ పేరు చెప్పుకొచ్చింది. 

దీంతో తెలుగు సినీ అభిమానులు, ముఖ్యంగా చిరంజీవి అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. డాన్స్ పరంగా చిరంజీవికి ఎంతటి పేరు ఉందో.. అందరికీ తెలిసిన విషయమే‌. మరోపక్క విజయ్ డాన్స్ కి ఎప్పుడు ట్రోల్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది చిరంజీవి కన్నా.. విజయ్ గొప్ప డాన్సర్ అని కీర్తి సురేష్ అనడంతో .. కీర్తిని ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ విజయ్ పాత సినిమాల్లోనే ట్రోల్ అయిన డాన్స్ బీట్లు కీర్తికి ట్యాగ్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link