Keerthy Suresh: బ్లాక్ డ్రెస్ లో కీర్తి సురేష్ కిర్రాక్ ఫోజులు..మహానటిలో ఎక్స్ పెక్ట్ చేయని యాంగిల్..

Thu, 17 Oct 2024-7:30 am,

కల్కి 2898 AD కీర్తి సురేష్ ..రీసెంట్ గా  ‘కల్కి 2898 AD’ చిత్రంలో బుజ్జి కారుకు తన గొంతుతో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఈ కారు పాత్రకు మంచి  ఇంపార్టెంట్ ఉండటం విశేషం.

ఆ తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

తెలుగులో 'నేను శైలజా' మూవీతో పరిచయమైంది. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.

అజ్ఞాతవాసి

తెలుగులో కాస్త గ్యాప్‌తో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.

 

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరు ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమాలోని నటనకు మహానటికి జాతీయ ఉత్తమ నటి అవార్డు ఈ భామను వరించింది.

లాస్ట్ ఇయర్ తెలుగులో నాని సరసన దసరా మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీలో హీరో చెల్లెలు పాత్రలో  నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఇక మహేష్ బాబు సరసన పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇప్పటి వరకు దక్షిణాదిలో కన్నడ మినహా అన్ని ఇండస్ట్రీస్‌లో నటించిన కీర్తి సురేష్‌.. త్వరలో 'బేబి జాన్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన 'తేరి' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link