Keerthy Suresh: తెల్ల చీరలో భువి నుంచి దిగివచ్చిన.. ఏంజెల్ లాగా కీర్తి సురేష్..

Mon, 08 Jul 2024-7:50 pm,

సౌత్ ఇండియాలో.. దాదాపు అన్ని భాషలలోనూ నటించిన హీరోయిన్ కీర్తి సురేష్. ముఖ్యంగా తెలుగు, తమిళంలో.. ఈ హీరోయిన్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్..  

ఆ తరువాత నానితో చేసిన నేను లోకల్ కూడా కీర్తి సురేష్ కి మంచి విజయం సాధించిపెట్టింది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  వచ్చిన మహానటి సినిమా కీర్తి సురేష్ రేంజ్ మార్చేసింది. ఈ చిత్రంకి గాను నేషనల్ అవార్డు సైతం అందుకుంది ఈ హీరోయిన్.

అయితే ఆ తరువాత కీర్తి నటించిన ఎన్నో చిత్రాలు ఫ్లాప్ గా మిగిలాయి. కానీ మళ్ళీ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో.. మరోసారి విజయం అందుకుంది కీర్తి సురేష్. ఇక అప్పటి నుంచి మళ్లీ వలస అవకాశాలు రావడం మొదలయ్యాయి. 

ఈ మధ్యనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 AD సినిమాలో బుజ్జి క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న.. బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 

ఈ క్రమంలో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో కీర్తి సురేష్ వైట్ శారీలో కనిపిస్తూ.. అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని  చేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link