Keerthy Suresh: ఇండస్ట్రీకి దూరం కానున్న కీర్తీసురేష్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఎంతో మంది అబ్బాయిలు కలల రాకుమారిగా మారిపోయింది. ముఖ్యంగా మహానటి సినిమాతో ఆమె పాపులారిటీ ఎంతో పెరిగింది.
ఒకవైపు వరస సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన 15 సంవత్సరాల ప్రేమ బంధానికి మరో అడుగు జోడించింది. ప్రముఖ దుబాయ్ వ్యాపారవేత్త అయిన తట్టిల్ ఆంటోనీతో గోవాలో డెస్టినేషన్ వివాహం చేసుకుంది. ఒకపక్క హిందూ స్థాయిలో మరోపక్క క్రిస్టియన్స్ స్టైల్ లో వీరి వివాహం జరిగింది.
అలా ఎట్టకేలకు తన కలలను నేర్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రేమించిన వాడే భర్తగా రావాలనుకున్న కీర్తి సురేష్ అందులో భాగంగానే పెద్దలను ఒప్పించి తన ప్రేమను పెళ్లిగా మార్చుకుంది.
ఇకపోతే పెళ్లి తర్వాత తాను హిందీలో నటిస్తున్న బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా మంగళసూత్రాన్ని ధరించి గ్లామర్డోస్ తో యువతను పిచ్చెక్కించింది. ప్రస్తుతం సౌత్, నార్త్లో దూసుకుపోతుందని అందరూ అనుకుంటుండగానే.. సడన్ గా ఇండస్ట్రీకి దూరం కాబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీనికి గల కారణాలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో బేబీ జాన్ సినిమా తర్వాత రివాల్వర్ రీటా, కన్నివేది అనే రెండు సినిమాలకు మాత్రమే ఆమె సంతకం చేసింది. మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్ల ఈ పుకార్లు వైరల్ అవుతున్నాయి.