Kerala Water Metro: దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రో.. ప్రత్యేకతలు తెలుసా..!
ఈ వాటర్ మెట్రో రైలు కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 దీవులను కలుపుతూ ప్రయాణించనుంది. ఇది కేరళలోని ఈ ద్వీపాలలో కనెక్టివిటీని మరింత పెంచనుంది.
వాటర్ మెట్రో సాధారణ మెట్రోలానే ఉంటుంది. పోర్ట్ సిటీలో రూ.1,136.83 కోట్లతో కొచ్చి వాటర్ మెట్రోను నిర్మించారు. బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ బోట్లను ఈ ట్రైన్‌లో వినియోగించారు.
వాటర్ మెట్రో పూర్తిగా ఎయిర్ కండిషన్డ్, పర్యావరణ రహితంగా ఉంటుంది. వికలాంగులకు ప్రత్యేక సదుపాయలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతపై ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
వాటర్ మెట్రో ప్రాజెక్టులో 78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మినల్స్ ఉంటాయి. మొదటి దశలో హైకోర్టు-వైపిన్ టెర్మినల్, విట్టిల-కక్కనాడ్ టెర్మినల్ మధ్య మొదలుకానుంది.
ప్రారంభంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాటర్ మెట్రోను నడపనున్నారు. పీక్ అవర్స్‌లో ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలో గోరఖ్‌పూర్, శ్రీనగర్, జమ్మూలో వాటర్ మెట్రోను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.