Ketika Sharma: క్యూట్ లుక్స్ తో కేతిక శర్మను ఇలా ఎపుడు చూసి ఉండరు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
కేతిక శర్మ హీరోయిన్ కెరీర్ స్టార్ట్ చేయకముందే.. యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తన డబ్ స్మాష్‌లతో వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది. అలా సినిమాల్లో వరుస అవకాశాలు పట్టేసింది.
కేతిక శర్మ 2023లో పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ నటించిన 'బ్రో' సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఈ ‘బ్రో’ సినిమాతో ఈమెకు మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ చిత్రం ఫలితం బోల్తా కొట్టడంతో కుదేలైంది. ఏది ఏమైనా వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.
త్వరలో నితిన్ హీరోగ నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో ఐటెం పాటలో త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఐటెం పాటపై మంచి ఇమేజ్ సంపాదించుకుంది.
కేతిక శర్మ ను తెలుగు ఆడియన్స్ గ్లామర్ డాల్ గానే యాది పెట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇపుడిపుడే తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకునే పడింది. ఎక్కువ గ్లామర్ షోతో సోషల్ మీడియాలో హీట్ పుట్టించే ఈమె.. తాజాగా క్యూట్ లుక్స్ తో ఫిదా చేసింది.
కేతిక శర్మ.. ముఖ్యంగా సినిమాల్లో అవసరమైన దానికంటే ఎక్కువ గ్లామర్ ఒలకబోయడం కేతిక కు ఐటెం భామగా మార్చేసిందనే చెప్పాలి.
కేతిక శర్మ.. 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో లక్ పరీక్షించుకొని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. స్టార్స్ హీరోల సినిమాల్లో ఛాన్సుల కోసం కేతిక శర్మ గ్లామర్ షోనే నమ్ముకుంది. తాజాగా ఈ భామ ఫిట్నెస్ పై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే విషయం లేటెస్ట్ పిక్స్ చూస్తే స్పష్టమవుతోంది.