Ketu Gochar 2024: కేతుగోచారం ఈ రాశిపై 10 నెలలు.. ఈ పరిహారంతో భారీ ఉపశమనం..
ప్రస్తుతం కేతువు కన్య రాశిలో ఉన్నాడు. 2025 మే వరకు ఈ రాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత కేతు గ్రహం రాశిని మారుస్తుంది. ఈ నేపథ్యంలో కన్యరాశికి కేతు గ్రహం నుంచి విముక్తి కలుగుతుంది. అయితే, ఈలోగా కేతు గ్రహ పీడ నుంచి విముక్తికి కొన్ని పరిహారాలు ఉన్నాయి.
కన్యరాశివారు ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నట్లయితే, పనిచేసే ప్రదేశంలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నిత్యం ఈ ఆదిదేవుని పూజ చేస్తూ ఉండాలి. గణేశునికి ప్రత్యేకమైన రోజు బుధవారం. ఈరోజు గరిక సమర్పించాలి.
ఎందుకంటే కన్య రాశి వారికి పూజ్యమైన దేవుడు గణేశుడిని భావిస్తారు. ఆయనకు ఇష్టమైన ప్రసాదాలను పెట్టాలి. ముఖ్యంగా ఈరోజు గణేష్ చాలీసా పఠించండి.ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది.
ప్రతిరోజూ స్నానం చేసిన వెంటనే వినాయకుని పూజించాలి. వీలైతే ఇంట్లో ఏర్పాటు చేసుకున్న గణేశా విగ్రహానికి అభిషేకం చేయాలి. గంగాజలతో చేస్తే మరింత మంచిది.
ముఖ్యంగా జాతకంలో ఎప్పుడైనా అశుభ గ్రహాలు ఉంటే బుధవారం ఆవుకు గడ్డి తినిపించాలి. దీంతో జాతకంలో బుధుడు బలంగా మారతాడు. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. అభివృద్ధికి అడ్డంకులు ఉండవు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)