Srinidhi Shetty: చీరలో మెరిసిన కేజీఎఫ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫొటోలు

Mon, 19 Dec 2022-11:36 pm,

శ్రీనిధి శెట్టి అక్టోబర్ 21, 1992న కర్ణాటకలో జన్మించింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్ టైటిల్స్‌ను గెలుచుకుంది. 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్‌ విన్నర్‌గానూ నిలిచింది.

2018లో కేజీఎఫ్ మూవీతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత కేజీఎఫ్ 2లోనూ హీరోయిన్‌గా నటించింది.   

అయితే ఈ రెండు సినిమాలు బ్లాక్‌హిట్ కావడంతో ఈ కన్నడ బ్యూటీ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట. అందుకే ఆఫర్లు తగ్గాయని ఇండస్ట్రీలో టాక్.   

విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.   

మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తోంది శ్రీనిధి. తాజాగా గోల్డ్ కలర్ చీరలో మెరిసిపోతున్న ఫొటోలను పంచుకుంది. మీరూ ఓ లుక్కేయండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link