Srinidhi Shetty Latest Pics:స్టైలిష్ లుక్‌లో శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ హీరోయిన్ అందాలకు కుర్రకారు ఫిదా!
తాజాగా శ్రీనిధి శెట్టి రకరకాల డ్రెస్‌లలో సందడి చేశారు. కేజీఎఫ్ 2 కోసం డిజైనర్స్ తయారు చేసిన డ్రెస్‌లు వేసుకుని సందడి చేశారు.
ప్రస్తుతం కేజీఎఫ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. వరసగా ఫొటోషూట్‌లకు ఫోజులు ఇస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు.
అన్ని భాషల్లో సినిమాలపై దృష్టి పెట్టబోతున్నట్టు ఇటీవల శ్రీనిధి తెలిపారు. తెలుగులో కూడా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారట.
తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధి శెట్టికి వరస అవకాశాలు వస్తున్నాయి. 'కోబ్రా' సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కేజీఎఫ్ 1, 2 చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి శెట్టి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీనిధి అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.
కేజీఎఫ్ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది.