Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ వినాయకుడి కర్రపూజ.. ఈసారి మహగణపతి ఎత్తు ఎంతో తెలుసా..?

Mon, 17 Jun 2024-7:13 pm,

మన దేశంలో అనేక పండుగలు ఉన్నాయి. హిందువులకు అయితే.. బోలేడు పండుగలు ఉన్నాయని చెప్పుకొవచ్చు. దీపావళి, దసరా, సంక్రాంతి, రాఖీ, వినాయక చవితి. వీటిలో గణేషుడి నవరాత్రి వేడుకలను ఎంతో ఫుల్ జోష్ తో నిర్వహిస్తారు. 

ఇక హైదరబాద్ నగరవాసుల వరకు వస్తే.. ఫెమస్ ఖైరతాబాద్ మహగణపతిని ఎంతో భక్తితో ప్రతిష్టించి పూజించుకుంటారు. కొన్ని వందల ఏళ్ల నుంచి ఖైరతాబాద్ విగ్రహన్ని ఉత్సవకమిటీ వారు ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తు వస్తున్నారు. 

ప్రత్యేకంగా హైదరాబాద్ కు గణేష్ నవరాత్రుల్లో ఎవరు వచ్చిన కూడా తప్పకుండా వినాయకుడిని దర్శించుకునే వెళ్తారు. ఈ క్రమంలో ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడి పూజలు షూరు అయ్యాయి. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిష్టాపన కర్రపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.  

 గతేడాది ఇక్కడి గణపయ్య తన ఎత్తుతో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. భాగ్య నగరం అంటే.. చాలా మందికి ఖైరతాబాద్ గణేషుడు, ఆయన ఎత్తుగురించి ఎప్పుడు వార్తలలో చర్చ జరుగుతు ఉంటుంది. ఈసారి సెప్టెంబర్ 7 వినాయక చవితి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీవాళ్లు కర్రపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ ఏడాది వినాయక చవితి పురస్కరించుకుని.. ఖైరతాబాద్​లో 70 అడుగుల మహగణేషుడి.. మట్టి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయనున్నట్లు ఉత్సవ కమిటితో పాటు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా మట్టి వినాయకుణ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించినట్లు చెప్పారు. గణేశ్‌ ఉత్సవాలకు ఈ ఏడాది కూడా మంచి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తామని వెల్లడించారు. 

తొలిపూజ కార్యక్రమంను తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌  నిర్వహిస్తారని చెప్పారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో 11 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని దానం నాగేందర్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ప్రతిఏటా ఖైరతాబాద్ గణపతిని సరికొత్త రూపంలో భక్తులకు దర్శనమిచ్చేలా రూపొందిస్తుంటారు. ఈ మహగణపతిని చూడటానికి ఏపీ,తెలంగాణలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో పాటు లక్షలాదిగా భక్తులు మహగణపతి ఆశీస్సుల కోసం వస్తుంటారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link