Kiara Advani: స్టైలిష్ దుస్తుల్లో మెరిసిన కియారా-సిద్ధార్థ్.. ఫ్యాన్స్ కి కనుల పండగ

Tue, 05 Mar 2024-4:34 pm,

2014 లో వచ్చిన హిందీ సినిమా ఫగ్లీ ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కియారా అద్వానీ. ఎం.ఎస్.ధోని చిత్రంలో సాక్షి సింగ్ ధోని పాత్రలో కనిపించి మంచి పేరు తెచ్చుకునింది.

లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకునింది. కాగా మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను తో తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. తెలుగులో మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ హీరోయిన్.

కాగా తెలుగులో ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ చిత్రం మాత్రం ఈమెకు డిజాస్టర్ మిగిల్చింది. అప్పటినుంచి తెలుగులో పెద్దగా చాన్సులో రాకపోయినా హిందీలో వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఈ మధ్యనే సత్య ప్రేమకి కథా సినిమాలో కనిపించి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజర్ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా ని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే వీరిద్దరి ఫోటోలు అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటాయి.

తాజాగా అనంత్ అంబానీ పెళ్లి సంబరాలకు హాజరైన వీరిద్దరూ.. స్టైలిష్ దుస్తుల్లో మెరిసిపోతూ కెమెరాకి ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link