Kiara Advani Photos: మోడ్రన్ డ్రస్సులో హొయలు పోతున్న రామ్ చరణ్ హీరోయిన్!
కియారా అడ్వాణీ.. 1992 జులై 31న జన్మించింది. ఈమె అసలు పేరు ఆలియా. హీరో సల్మాన్‌ఖాన్ సూచనతో పేరు మార్చుకుని కియారా అడ్వాణీ మారింది.
2014లో వచ్చిన 'ఫగ్లీ' హిందీ చిత్రంతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్ 'ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించి.. మెప్పించింది.
ఆ తర్వాత బాలీవుడ్ లో 'గుడ్ న్యూస్', 'కబీర్ సింగ్'తో చాలా పేరు తెచ్చుకుంది. 'షేర్షా', 'భూల్ భులయ్య2', 'మిస్టర్ లెలె', 'జుగ్ జుగ్ జియో' సినిమాల్లోనూ నటిస్తోంది.
ప్రస్తుతం శంకర్ - రామ్‌చరణ్ కాంబోలో రానున్న సినిమాకు హీరోయిన్గా ఎంపికైంది.