Kiwi Benefits: ఈ ఫ్రూట్ తింటే వచ్చే లాభాలు తెలిస్తే.. మీరు ప్రతిరోజూ తినకుండా ఉండలేరు..
కీవీపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఏ, బీ6, బీ12, ఇ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలకు పవర్‌హౌజ్ కీవీ దీంతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
కీవీలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ బాడీలను ఉత్పత్తికి సహకరిస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కీవీ మూడ్ మెరుగుపరిచే సెరోటోనిన్ ఉత్పత్తిని మెరుగు చేస్తుంది.
కీవీపండు సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కీవీ పండు ఎలక్ట్రోలైట్ సమతుల్యం చేసే పొటషియం ఉంటాయి. డెంగీ రోగులు కీవీలు తప్పకుండా తమ డైట్లో చేర్చుకోవాలి.
అంతేకాదు కీవీలో బయోయాక్టీవ్ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది ఫ్రీ రాడికల్ నుంచి కాపాడుతుంది.అందుకే కీవీ పండును డైట్లో చేర్చుకుంటే మన శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి.
కీవీలో విటమిన్ సీ, పాలీఫెనల్స్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను కపాడాతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో కొవ్వులు పేరుకుపోకుండా కార్డియోవాస్క్యూలర్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ప్రతిరోజూ మీ డైట్లో కీవీ పండును చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా వీటిని సలాడ్, పిజ్జా, యోగార్ట్, స్మూథీస్‌లో వేసుకుని తీసుకోవచ్చు. కీవీ పండుు మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరగ్యం బాగుంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)