Kira narayanan: ఇండియా-ఇంగ్లండ్ సిరీస్ యాంకర్ కిరా నారాయణన్ స్టైల్ చూస్తారా..అసలు ఎవరీమె
2018లో కిరా నారాయణన్ కౌలాలంపూర్ నుంచి ముంబాయికు వచ్చింది. ప్రొఫెషనల్ యాక్టిక్ కెరీర్ ప్రారంభించింది. ప్రో కబడ్డీ లీగ్ కు యాంకరింగ్ చేసింది.
కిరా నారాయణన్ లండన్ యూనివర్శిటీ కాలేజ్ నుంచి బీఎస్సీ సైకాలజీ చదివింది. దాంతోపాటే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ డిప్లొమో పూర్తి చేసింది. గ్రేట్ బ్రిటన్‌లోని నేషనల్ యూత్ థియేటర్ సభ్యురాలు కూడా.
కిరా నారాయణన్ యాంకర్ మాత్రమే కాదు ఒక నటి కూడా. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో పెరిగింది. 13 ఏళ్ల వయస్సు నుంచే యాక్టింగ్ ప్రారంభించింది.
ఐపీఎల్ 2020 సందర్బంగా కిరా నారాయణన్ క్రికెట్ లైవ్ షోలో యాంకర్‌గా ఇప్పటికే వ్యవహరించింది. ఈ టోర్నమెంట్‌లో బ్రెట్ లీ, బ్రియన్ లారా, వంటి దిగ్గజ క్రికెటర్లు ఆమెతో కలిసి యాంకరింగ్ హోస్ట్ చేస్తున్నారు.
కిరా నారాయణన్ ఇటీవల ఇండియా ఇంగ్లండ్ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar)తో కలిసి లైవ్ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తోంది. క్రికెట్ అభిమానులు ఆమె కాన్ఫిడెన్స్‌పై ఫిదా అవుతున్నారు. లిటిల్ మాస్టర్‌తో కలిసి ఇద్దరి జుగల్ బందీ అద్భుతంగా ఉంటోంది.