Alia Ranabir Net Worth: బాలీవుడ్ కొత్త జంట అలియా-రణబీర్ ఆస్తుల విలువెంతో తెలుసా...
మీడియా రిపోర్ట్స్ ప్రకారం రణబీర్ కపూర్ ఆస్తుల విలువ సుమారు రూ.330 కోట్లు. రణబీర్ ఒక్కో సినిమాకు సుమారు రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు.
సినిమాలతో పాటు వివిధ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రణబీర్ భారీగా సంపాదిస్తున్నాడు. రణబీర్ ప్రమోట్ చేస్తున్న బ్రాండ్స్‌లో ఒప్పో, టాటా ఏఐజీ, కోకా కోలా, ఒరియో ఉన్నాయి.
ఒక్కో బ్రాండ్ షూట్‌కు రణబీర్ ఒకరోజుకు రూ.6 కోట్లు వరకు తీసుకుంటాడని టాక్. దానికి తోడు పలు రంగాల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు చెబుతారు.
అలియా-రణబీర్ ఉంటున్న వాస్తు అపార్ట్‌మెంట్ విలువ రూ.30 కోట్లు వరకు ఉంటుందని చెబుతున్నారు.
డఫ్ అండ్ ఫెల్ప్స్ రిపోర్ట్స్ ప్రకారం.. 2021లో అలియా భట్ ఆస్తుల విలువ సుమారు రూ.517 కోట్లు. మహేష్ భట్ కూతురైన అలియా భట్‌కు పెద్ద ఎత్తున ప్రాపర్టీస్ ఉన్నాయి.
అలియా భట్ ఔరెలియా, కార్నెట్టో, లేస్, ఫ్రూటీ, డురోఫ్లెక్స్, మన్యవర్, ఫ్లిప్‌కార్ట్, క్యాడ్బరీ, బ్లెండర్స్‌ప్రైడ్ తదితర బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఒక్కో బ్రాండ్ షూట్‌కు ఒకరోజుకు రూ.2 కోట్లు వరకు అలియా చార్జ్ చేస్తుందట.
అలియా-రణబీర్ ఇద్దరి ఆస్తులు కలిపితే రూ.839 కోట్లు వరకు ఉండొచ్చునని చెబుతున్నారు.