Cricketers vs Tv Anchors: టీవీ యాంకర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే
టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్ని (Stuart Binny)ప్రఖ్యాత స్పోర్ట్స్ యాంకర్ మయంతి లేంగర్ ( Mayanti Langer)ను 2012లో పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బిన్నీ పెద్దగా పేరు సంపాదించకపోయినా..మయంతి మాత్రం మంచి పేరు సాధించింది.
దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ మోర్న్ మార్కిల్ (Morne Morkel)2014 డిసెంబర్ నెలలో తన గర్ల్ ఫ్రెండ్ రోజ్ కెల్లీ (Roz Kelly)ని పెళ్లి చేసుకున్నాడు. రోజ్ ఓ ప్రఖ్యాత యాంకర్. ఛానెల్ 9 లో పని చేస్తోంది.
ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ (Shaun Marsh)2014 ఏప్రిల్‌లో ఛానెల్ 7 యాంకర్‌గా పని చేస్తున్న రెబెకా ఓడోవాన్ (Rebecca O’Donovan)ను పెళ్లి చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson)2010 మే నెలలో తన గర్ల్‌ఫ్రెండ్ లీ ఫర్లాంగ్ (Lee Furlong)ను పెళ్లి చేసుకున్నాడు. లీ ఫర్లాంగ్ స్పోర్ట్స్ ఛానెల్ యాంకర్‌గా పని చేస్తోంది.
న్యూజిలాండ్ టాప్ క్రికెటర్ మార్టిన్ గుప్టిల్ ( Martin Guptill)2014 సెప్టెంబర్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ లారా మ్యాక్ గోల్డ్రిక్ ( Laura McGoldrick)ను పెళ్లి చేసుకున్నాడు. మ్యాక్ గోల్డ్రిక్ స్పోర్ట్స్ ఛానెల్ యాంకర్‌గా పని చేస్తోంది.