NPS Vatsalya Scheme: రూ. 10వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. రూ. 11 కోట్లు మీ చేతికి.. ఈ స్కీంతో మీ పిల్లలు కోటీశ్వరులు అవ్వడం పక్కా

Thu, 09 Jan 2025-9:42 am,

 NPS Vatsalya Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ పిల్లల భవిష్యత్తు కోసం ఓ చక్కటి స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీం ప్రకారం మీరు కనిష్ట మొత్తంలో 1000 రూపాయల నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఈ స్కీం కింద మీరు పెట్టుబడి పెట్టినట్లయితే.. ఏకంగా 11 కోట్ల రూపాయల భారీ మొత్తం మీ పిల్లల పేరు మీద జమవుతుంది. అయితే ఈ స్కీం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

ఈ  ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ నిర్వహిస్తోంది. ఈ స్కీము ప్రత్యేకంగా పిల్లలు, మైనర్ల పేరుతో డబ్బులు పెట్టుబడి పెట్టుకునేందుకు రూపొందించారు.పిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇందులో కనిష్టంగా నెలకు రూ. 1000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. దానికి ఎలాంటి లిమిట్ లేదు.  

ఈ స్కీం కింద మీరు అప్పుడే పుట్టిన బిడ్డ పేరుతో నెలకు ₹1000 చొప్పున డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్లయితే 18 ఏళ్ల తర్వాత ఆ బిడ్డ పేరు మీద జమ చేసిన మొత్తం 2లక్షల 16 వేల రూపాయలు డిపాజిట్ అవుతుంది. సంవత్సరానికి 12.86% వడ్డీ కింద జమ చేస్తే వడ్డీ ఆదాయము 6,32,000 జమవుతుంది. వడ్డీతో పాటు మీ డిపాజిట్ మొత్తం కలిపితే 8 లక్షల 48 వేల రూపాయలు మీ సొంతమవుతుంది.  

ఈ పథకం కింద మీరు 20% డబ్బును విడ్రా చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మిగతా 80% డబ్బును అంటే 6.78 లక్షల రూపాయలను యాన్యుటి స్కీం కింద డిపాజిట్ చేసినట్లయితే రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో మీకు డబ్బు రిటర్న్ వస్తుంది.  

ఇక నెలకు పదివేల రూపాయల చొప్పున మీరు ఈ పథకంలో డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే రేట్ అఫ్ రిటర్న్ 12.86% వడ్డీగా జమ చేసినట్లయితే పిల్లలకు 60 ఏళ్లు వచ్చేవరకు 11.5 కోట్ల రూపాయలు లభించే ఛాన్స్ ఉంటుంది.  

 ఎమర్జెన్సీ సమయంలో పిల్లలకు 18 ఏళ్ల లోపు మీరు మూడుసార్లు డబ్బులు వెనక్కు తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల చదువుల కోసం, వైద్య ఖర్చులకోసం ఈ డబ్బులు మీరు వాడుకునే అవకాశం ఉంటుంది.  

ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వారికి సెక్షన్ 80c కింద 1. 5 లక్షల  పంట మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ స్కీమ్ లో సాధారణ పౌరులతో పాటు ప్రవాస భారతీయులు కూడా డబ్బులు పెట్టుబడి పెట్టుకునే అవకాశం లభిస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link