Team India Play Eleven: ముంబై రెండవ టెస్ట్‌లో టీమ్ ఇండియా ప్లే లెవెన్ ఎవరో తెలుసా
ముంబై టెస్ట్ మ్యాచ్‌లో మొహమ్మద్ సిరాజ్‌కు స్థానం కల్పించవచ్చు. ఇశాంక్ శర్మ దీర్ఘకాలంగా బౌలింగ్‌లో పెద్దగా ప్రతిభ కనబర్చనందున తప్పించే అవకాశముంది.
ఉమేష్ యాదవ్..టీమ్ ఇండియా తరపున 50 టెస్ట్ మ్యాచ్‌లు అడాడు. 156 వికెట్లు సాధించాడు. ముంబై టెస్ట్‌లో కచ్చితంగా ఆడనున్నాడు.
అశ్విన్ పటేల్ టెస్టే క్రికెట్‌లో ప్రవేశించినప్పటి నుంచి అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబర్చడంతో రెండవ టెస్ట్ స్థానం ఖరారైంది.
టీమ్ ఇండియాలో అశ్విన్, జడేజా రూపంలో ఇద్దరు మంచి ఆల్ రౌండర్లున్నారు. ఈ ఇద్దరూ టెస్ట్ క్రికెట్‌లో అద్భుత బౌలింగా్‌తో క్రికెటర్లకు చక్కలు చూపించాడు.
రిద్ధిమాన్ సాహా కూడా ప్లేయింగ్ 11లో ఉండనున్నాడని ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు.
శ్రేయస్ అయ్యర్ కాన్పూర్ టెస్ట్‌లో ఆరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండవ ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. శ్రేయస్స్ అయ్యర్ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అత్యంత దుర్లభమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. స్వదేశీ మ్యాచ్‌లలో రహానే అత్యంత ఘోరంగా విఫలమై ఉన్నాడు. కాన్పూర్ టెస్ట్‌లో కూడా అతని ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది.
మయాంక్ అగర్వాల్ స్థానాన్ని విరాట్ కోహ్లీ భర్తీ చేయనున్నాడు. కోహ్లీ అభిమానులు అతన్నించి సెంచరీ కోసం రెండేళ్లుగా నిరీక్షిస్తున్నారు.
మాయంక్ అగర్వాల్‌ను తప్పించాలనే ఆలోచన ఉండటంతో శుభమన్ గిల్, చేతేశ్వర్ పూజారాలతో ఇన్నింగ్స్ ఓపెన్ చేయవచ్చు. అదే సమయంలో దక్షిణాఫ్రికా పర్యటనలో రాహుల్ ద్రావిడ్..అజింక్యా రహానేకు మరో అవకాశమివ్వాలని అనుకుంటున్నాడు.