Government Scheme: ఇంట్లో తొలికాన్పు జరగనుందా..అయితే ఇలా చేస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు

Thu, 14 Apr 2022-12:25 pm,

ప్రధానమంత్రి మాతృ వందన పథకం కోసం ఆశా వర్కర్లు, లేదా ఏఎన్ఎంల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ఆన్‌లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పధకాన్ని అందరు మహిళలకు వర్తింపజేస్తారు. ప్రసవం ఏ ఆసుపత్రిలో జరిగినా ఫరవాలేదు. 

తొలిసారి తల్లి అయ్యే మహిళకు పోషణ అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. తొలి వాయిదాలో వేయి రూపాయలు రెండవ వాయిదాలో 2 వేలు, మూడవ వాయిదాలో 2 వేలు అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలకు ఈ పధకం వర్తించదు.

ఈ పధకం లబ్ది పొందేందుకు తొలిసారి గర్భిణీ అయినప్పుడు తనతోపాటు, తన భర్త ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ రిజిస్ట్రేషన్‌కు అవసరమౌతాయి. బ్యాంక్ ఖాతా ఉమ్మడి కాకూడదు. గర్భిణీ మహిళకు ఈ పధకం కింద 5 వేల రూపాయల నగదు మూడు వాయిదాల్లో అందుతుంది.

ప్రధానమంత్రి మాతృ వందన పథకంలో తొలిసారి గర్ణం దాల్చే మహిళలకు ఆర్ధిక సహాయం అందిస్తారు. ఈ పధకమే ప్రధానమంత్రి గర్భావస్థ సహాయ పధకం అని కూడా పిలుస్తారు. 

మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం పేరు ప్రధానమంత్రి మాతృ వందన పథకం. ఈ పధకం 2017 జనవరిలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link