Krishna Janmashtami: కృష్ణుడికిష్టమైన వస్తువులు ఇవే, జన్మాష్టమి నాడు కొంటే అంతా లాభమే
జన్మాష్టమి నాడు వైజయంతి మాల కొంటే అంతా శుభం జరుగుతుందని ప్రతీతి. ఇంట్లో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
జన్మాష్టమి రోజున ఆవు లేదా దూడవి చిన్న విగ్రహాలు కొనుగోలు చేసి పూజ గదిలో లేదా గదిలో ఈశాన్య దిశలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
కృష్ణ భగవానుడికి ఆవు, వెన్నంటే చాలా ఇష్టం. అందుకే జన్మాష్టమి రోజున వెన్న కొనుగోలు చేసి కృష్ణుడికి అర్పిస్తే మంచి లాభాలుంటాయి.
నెమలి పింఛంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందంటారు. ఇది వాస్తు దోషాన్ని కచ్చితంగా దూరం చేస్తుందని నమ్మకం. జన్మాష్టమి నాడు నెమలి పింఛం ఇంట్లో పెట్టడం వల్ల చాలా సమస్యల్నించి విముక్తి పొందవచ్చు.
జన్మాష్టమి రోజున మురళి కొనడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇంట్లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. కృష్ణుడిని పూజించే సమయంలో తప్పకుండా మురళిని అర్పించాలి.